telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

ఆ ఇద్దరిలో ఎవరు…?

భారత జట్టుకు ముగ్గురు సీనియర్ పేసర్లు దూరం అయ్యారు. ఇషాంత్ శర్మ ఐపీఎల్ లో గాయపడగా, షమీ మొదటి టెస్టులో, ఉమేష్ కు రెండో టెస్టులో గాయమ్ అయింది. దాంతో వారు మొత్తం సిరీస్ కే దూరమయ్యాడు. తన గాయానికి చికిత్స కోసం తిరిగి భారత్ కు కూడా పయనమయ్యాడు ఉమేష్. అయితే ఇప్పుడు మూడో టెస్టులో ఉమేష్ స్థానంలో జట్టులోకి ఎవరు వస్తారు అనేదే పెద్ద చర్చగా సాగింది. ఐపీఎల్ లో రాణించి భారత జట్టులోకి ప్రవేశించిన తర్వాత అసైన్ పై మంచి ప్రదర్శన చేసిన నటరాజన్ ను జట్టులోకి తీసుకోవాలి అని సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. కానీ అతడిని కాకుండా మరో యువ పేసర్ శార్దూల్ ఠాకూర్ ను జట్టులోకి తీసుకోనున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే దేశవాళీ క్రికెట్ లో నటరాజన్ కంటే శార్దూల్ గణాంకాలు అద్భుతంగా ఉన్నాయి. అందుకే అతనే మూడో టెస్ట్ లో ఉమేష్ స్థానంలో వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ విషయం లో తుది నిర్ణయం మాత్రం భారత హెడ్ కోచ్, కెప్టెన్, బౌలింగ్ కోచ్ కలిసి తీసుకుంటారు. మరి సిడ్నీ వేదికగా ఈ నెల 7న ప్రారంభం కానున్న మూడో టెస్టు లో ఉమేష్ స్థానంలో ఎవరు ఆడుతారు… ఈ మ్యాచ్ లో ఎవరు విజయం సాధిస్తారు అనేది చూడాలి.

Related posts