టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ పెళ్లి విషయమై సోషల్ మీడియా లో ఓ వార్త హల్చల్ చేస్తోంది. అంతేకాదు సీక్రెట్‌గా ఆమె ఎంగేజ్‌మెంట్ కూడా జరిగిపోయిందని తెలుస్తుండటం మరింత ఆసక్తికరంగా మారింది. తాజాగా కాజల్ పెళ్లాడబోతోన్న వ్యక్తి పేరు కూడా బయటికి వచ్చేసింది. ఇంటీరియర్ డిజైనర్, వ్యాపారవేత్త అయిన గౌతమ్ కిచ్లుని కాజల్ వివాహం చేసుకోనుందని, ఇప్పటికే అతనితో నిశ్చితార్థం కూడా పూర్తయిందని తాజాగా వార్తలు బయటికి వచ్చాయి. ముంబైలో వీరి వివాహం జరగనుందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇక కాజల్ సినిమాల విషయానికొస్తే… ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. మెగాస్టార్ చిరంజీవి సరసన ఆచార్య, కమల్ హాసన్ సరసన భారతీయుడు 2, అలాగే మంచు విష్ణుతో మోసగాళ్లు చేస్తున్న కాజల్ అగర్వాల్… మరో మూడు సినిమాలను లైన్‌లో పెట్టేసిందని టాక్. అయితే ఈ 35 ఏళ్ళ బ్యూటీ ఎట్టకేలకు పెళ్లికి రెడీ అయిందనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
next post
నేను ప్రేమించబోయే వ్యక్తి యువకుడా, వృద్ధుడా అనేది అనవసరం : రకుల్