కొన్ని ఆరోగ్య జాగ్రత్తలు పాటిస్తే రక్తపోటు సాధారణంగా ఉండేలా చూసుకోవచ్చు. అందుకు ఏం చేయాలో చెబుతున్నారు పోషకాహార నిపుణులు..
సోడియం, పొటాషియం సమతౌల్యం కోసం శుద్ది చేయని నల్ల ఉప్పు లేదా రాతి ఉప్పు వాడాలి. తెల్లని ఐయోడైజ్డ్ ఉప్పులో సోడియం మాత్రమే ఉంటుంది. ఆ ఉప్పులో పొటాషియం ఉండదు.
బాగా వేగించిన ఆహార పదార్ధాలు, ప్యాకేజ్డ్ ఫుడ్స్ పోషకాలను గ్రహించనీయవు. ఈ ఫుడ్స్ సోడియం, పొటాషియం శాతాన్ని, నీటి శాతాన్ని మారుస్తాయి. దీని ఫలితంగా రక్తపోటులో హెచ్చుతగ్గులు వస్తాయి.
ఇంటి వద్ద తయారు చేసుకున్న పచ్చళ్లలో ఉండే ఆరోగ్యకర బ్యాక్టీరియా రక్తపోటును అదుపులో ఉంచడంలో సాయపడుతుంది. అలాగే రకరకాల చిరు, పప్పు ధాన్యాలతో తయారైన పాపడ్స్‌లోని నల్ల మిరియాలు, జీలకర్ర ఆరోగ్యానికి మంచి చేస్తాయి.
రక్తపోటు అదుపులో ఉంటే చాలా ఆనోరోగ్యాలు దరిచేరవు. సరిపోను నిద్ర, విశ్రాంతి శరీరానికి చాలా అవసరం.
రోజూ కాసేపు నడవడం వల్ల రక్తపోటు సాధారణంగా ఉంటుంది. కార్డియో, యోగ వంటి వ్యాయామాలు దీర్ఘకాలికంగా రక్తపోటును తగ్గిస్తాయి.
previous post
next post
ఆనాడు కేసీఆర్ మేల్కొని ఉంటే ఎంతో బాగుండేది: విజయశాంతి