telugu navyamedia
రాజకీయ వార్తలు

టిక్ టాక్ యాప్ పై అమెరికా నిషేధం..ఘాటుగా స్పందించిన చైనా!

tik tok

చైనాకు చెందిన టిక్ టాక్, వీ చాట్ యాప్ లపై అమెరికా నిషేధం విధించడం తెలిసిందే. అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని చైనా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. తమ కంపెనీలపై అనైతిక చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించింది. అంతర్జాతీయ పెట్టుబడిదారుల విశ్వాసాన్ని దెబ్బతీస్తున్నారని చైనా వాణిజ్య శాఖ మండిపడింది.

ఎలాంటి ఆధారాలు లేకుండానే రెండు సంస్థలను అణచివేసేందుకు అమెరికా తన అధికారాన్ని వాడుకుంటోందని విమర్శించింది. అమెరికా ఇలాంటి ఏకపక్ష నిర్ణయాలతో ముందుకెళితే దీటుగా స్పందిస్తామని తెలిపింది. తమ దేశ కంపెనీల ప్రయోజనాలు కాపాడేందుకు కఠిన చర్యలకు దిగుతామని హెచ్చరించింది.అమెరికా ఇకనైనా అంతర్జాతీయ నియమాలను పాటించాలనిచైనా వాణిజ్య శాఖ హితవు పలికింది.

Related posts