telugu navyamedia
క్రీడలు వార్తలు సామాజిక

నగ్న చిత్రాన్ని పోస్టు చేసి..వార్తల్లోకెక్కిన మహిళా క్రికెటర్!

sara talor cricketer

సోషల్ మీడియాలో నగ్న చిత్రాన్ని పోస్టు చేసి వార్తల్లోకెక్కారు ఓ మహిళా క్రికెటర్. ఇంగ్లాండ్‌కు చెందిన సారా టేలర్ అనే మహిళ క్రికెటర్ బ్యాటింగ్ లోనూ, కీపింగ్‌ లోనూ అద్భుతమైన ఆటను ప్రదర్శిస్తూ అభిమానులను అలరిస్తోన్న సంగతి తెలిసిందే. ఇంగ్లాండ్ జాతీయ జట్టులో ఎప్పటి నుంచో కొనసాగుతున్న సారా టేలర్… ఈ మధ్య కాలంలో ఆమె కొన్ని వ్యక్తిగత సమస్యలను ఎదుర్కొంటోంది.
ఈ కారణంగానే ఆమె ఈ మధ్యకాలంలో చాలా క్రికెట్ మ్యాచ్‌లకు దూరమైంది. గత కొంతకాలంగా ఆందోళన సమస్యతో బాధఫడుతున్న సారా టేలర్ ఇటీవలే సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరిస్‌కు సైతం ఆడలేదు. ఇటీవలే తిరిగి మైదానంలోకి అడుగుపెట్టిన సారా సర్రే స్టార్స్ తరుఫున మంచి ప్రదర్శన చేసింది.

ఈ నేపథ్యంలో బుధవారం సారా టేలర్ తన నగ్న చిత్రాన్ని ఇనిస్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేసి ఒక్కసారిగా వార్తల్లోకెక్కారు. అందులో దుస్తులేమీ లేకుండా వికెట్‌ కీపింగ్‌ చేస్తోంది. ఆమె తన కంఫర్ట్ జోన్‌ను దాటుకుని మరీ ఇలా ఎందుకు చేయాల్సి వచ్చిందో కూడా వివరణ ఇచ్చారు. మహిళల శరీరం, ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పించేందుకే ఆమె ఎవరూ చేయని సాహసం చేసింది. ఈ మంచి పనికి తనను ఆహ్వానించిన ఉమెన్స్ హెల్త్ యుకే ఆర్గనైజేషన్‌కు సారా ధన్యవాదాలు తెలిపారు.

షూటింగ్‌లో ఆమె సౌకర్యవంతంగా లేనప్పటికీ ఓ మంచి కారణం కోసం ధైర్యంగా అడుగు వేసినందుకు సారా ఇప్పుడు ఎంతగానో గర్విస్తోంది. ఇతర మహిళలకు సైతం తాను సందేశంతో కూడిన మేసేజ్‌ను పాస్ చేయడంపై ఆమె సంతోషం వ్కక్తం చేశారు. ఈ మేరకు తన ఇనిస్టాగ్రామ్‌లో నగ్న ఫోటోని పోస్టు చేస్తూ “నా గురించి తెలిసిన వారెవ్వరైనా నేను కంఫర్ట్‌జోన్‌ నుంచి కాస్త బయటకు వచ్చినట్టు తెలుసుకుంటారు. అయితే మహిళల ఆరోగ్య సమస్యలపై అవగాహన కార్యక్రమంలో నన్ను భాగస్వామిని చేసినందుకు ఉమెన్స్‌హెల్త్‌ యూకేకు ధన్యవాదాలు. నా దేహంతో నేనెన్నో సమస్యలు ఎదుర్కొంటున్నాను. వాటిలో కొన్నింటిని అధిగమించాను. మహిళా సాధికారతను సాధించాను. చూసేందుకు ప్రతి అమ్మాయి బాగుంటుంది. దయచేసి గుర్తుంచుకోండి ప్రతి అమ్మాయి అందమైందే” అంటూ సారా టేలర్ వివరణ ఇచ్చింది.

Related posts