telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

రాధే శ్యామ్ గ్లింప్స్ వచ్చేసింది…

పాన్ ఇండియా హీరో ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో ‘రాధేశ్యామ్’ అనే పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లవ్ స్టోరీ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా నుండి వరుస అప్‌డేట్స్ వస్తున్నాయి. ఈ మాదేవె సినిమాలోని మ్యూజిక్ కంపోజర్స్‌ను తెలుపుతూ ఓ అప్‌డేట్ ఇచ్చారు. ఈ సినిమాకు హిందీలో మిథున్ మనన్ భరధ్వాజ్ సంగీతం అందించగా, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో జస్టిన్ ప్రభాకరన్ సంగీతాన్ని అందించారు. అలాగే ఈరోజు ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజు కానుకగా ఈ చిత్రం నుంచి గ్లిమ్ప్స్ ను రిలీజ్ చేసింది చిత్రబృందం. అలాగే ఈ సినిమా విడుదల తేదిని కూడా ప్రకటించింది. రాధేశ్యామ్ సినిమా ఈ ఏడాది జులై 30 న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అయితే ఈ సినిమా నుంచి వచ్చే ప్రతి అప్‌డేట్ సినిమాపై అంచనాలను రెట్టింపు చేస్తున్నాయి. చూడాలి మరి రాధేశ్యామ్ సినిమా అభిమానులను ఎంతగా ఆకట్టుకుంటుంది.. ఎంత భారీగా వసూళ్లు సాధిస్తుంది అనేది.

Related posts