telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్

మరో ప్రపంచ రికార్డుకు చేరువలో.. రోహిత్ శర్మ..

rohit sharma very near to another world record

భారత క్రికెటర్, స్టాండిన్ కెప్టెన్ రోహిత్ శర్మ మరో ప్రపంచ రికార్డుకు చేరువలో ఉన్నాడు. న్యూజిలాండ్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఇప్పుడు అలాంటి మరో అరుదైన రికార్డుకు దగ్గరలో ఉన్నాడు. ఇది సిక్సర్ల రికార్డు. రోహిత్ టీ20ల్లో ఇప్పటివరకు మొత్తం 102 సిక్స్‌లు బాదాడు. మరో రెండు సిక్స్‌లు బాదితే టీ20ల్లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన ప్లేయర్‌గా నిలుస్తాడు. ప్రస్తుతం 103 సిక్స్‌లతో క్రిస్ గేల్, మార్టిన్ గప్టిల్ సంయుక్తంగా తొలి స్థానంలో ఉన్నారు. రెండు భారీ షాట్లతో ఈ ఇద్దరినీ వెనక్కి నెట్టే అవకాశం ఇప్పుడు రోహిత్‌ చేతిలో ఉంది.

ఇప్పటికే భారత్ తరఫున వన్డేల్లో అత్యధిక సిక్స్‌లు కొట్టి ప్లేయర్‌గా ధోనీ (215 సిక్స్‌లు) రికార్డును రోహిత్ సమం చేసిన విషయం తెలిసిందే. రోహిత్ కెప్టెన్సీలో 14 టీ20లు ఆడిన టీమిండియా 12 మ్యాచుల్లో గెలవగా.. కేవలం రెండింట్లో మాత్రమే ఓడింది. ఇప్పుడు న్యూజిలాండ్‌తో జరగబోయే మూడో టీ20లో గెలిపిస్తే.. భారత్ తరఫున మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్లలో రోహిత్ రెండవ వాడుగా నిలుస్తాడు. ఈ లిస్ట్‌లో ధోనీ (72 మ్యాచుల్లో 41 విజయాలు) తొలి స్థానంలో ఉండగా.. కోహ్లితో (20 మ్యాచుల్లో 12 విజయాలు) కలిసి రోహిత్ రెండోస్థానంలో ఉన్నాడు.

Related posts