telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

2017 నుంచే ప్రెగ్నెంట్… : సమంత

Samantha

పెళ్లి తరువాత వరుస హిట్లతో దూసుకుపోతున్నారు సమంత, నాగచైతన్య. పెళ్లి తరువాత వీరిద్దరూ కలిసి నటించిన “మజిలీ” చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. అయితే గత కొంతకాలంగా ఎప్పుడు తల్లి కాబోతోందనే విషయంపై పలు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. చాలా ఇంటర్వ్యూల్లో సమంతను ఎప్పుడు తల్లికాబోతున్నారని ప్రశ్నించగా తెలివిగా సమాధానం ఇస్తూ వస్తుంది. తాజాగా సోషల్ మీడియాలో అభిమానులతో చాట్ చేసింది సామ్. ఇక్కడ కూడా అదే ప్రశ్న. ఓ నెటిజన్ మీరు ప్రెగ్నెంటా ..? అని ప్రశ్నించగా సమంత దానికి కొంటె గా సమాధానం చెప్పింది. 2017 నుంచే తాను ప్రెగ్నెంట్ గా ఉన్నానని, అయితే బయటకు రావడానికి బేబీ ఇష్టపడటం లేదని, ఈ బిడ్డ బయటకు రావడానికి చాలా సమయం తీసుకుంటోంది అంటూ పంచ్ వేసింది. తన చేతిపై ఉండే టాటూ గురించి చెపుతూ, అది తనకు, తన భర్త నాగ చైతన్యకు చాలా ప్రత్యేకమైనదని చెప్పింది సమంత. అక్కినేని నాగ చైతన్య, సమంత పెళ్లి జరిగి రెండున్నరేళ్లు గడిచిపోయిన విషయం తెలిసిందే.

Related posts