మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ ఫోటోను పోస్ట్ చేశాడు. “ఎప్పుడూ మీ బెస్ట్ కోసం ప్రయత్నించండి” అనే క్యాప్షన్ తో ఈ ఫోటోను షేర్ చేశాడు. సైడ్ యాంగిల్‌లో చురకత్తుల్లాంటి చూపు, కోర మీసాలతో ఉన్న ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రామ్ చరణ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్నాడు. ఇలా ఎప్పటికప్పుడు ఏదో కొత్త విషయంతో అభిమానులను ఆకట్టుకుంటున్నాడు. ప్రస్తుతం రామ్ చరణ్ రాజమౌళి తెరకెక్కిస్తున్న “ఆర్ఆర్ఆర్” మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఇందులో ఎన్టీఆర్ కూడా నటిస్తున్నాడు. ఇందులో కొమరం భీమ్ గా ఎన్టీఆర్ నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో డివివి దానయ్య నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ ఒలీవియా మోరిస్ నటిస్తుండగా, చరణ్ సరసన అలియా భట్ నటిస్తోంది. పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాని 2021 జనవరి 8న రిలీజ్ చేయనున్నారు.