రాష్ట్రంలోని తాజాగా మొత్తం మూడు వేర్వేరు ప్రాంతాలో జరిగిన ఎన్‌కౌంటర్లలో ఆరుగురు మావోయిస్టులు హతమయ్యారు. పోలీసులు కూంబింగ్ చేపడుతున్న సమయంలో ఈ ఎన్‌కౌంటర్లు జరిగాయి. సుకుమా జిల్లా పరిధిలోని తాడ్‌మెట్ల వద్ద మావోయిస్టులు రోడ్డును తవ్వినట్లు భద్రతా బలగాలకు సమాచారం అందింది. దీంతో డీఆర్‌జీ బలగాలు పెట్రోలింగ్ చేపట్టాయి. ఈ సమయంలో శనివారం సాయంత్రం 6గంటల సమయంలో భద్రతా బలగాలపై మావోయిస్టులు కాల్పులు జరిపారు. దీంతో అప్రమత్తమైన బలగాలు ఎదురుకాల్పులు చేపట్టాయి. ఈ ఘటనలో ముగ్గురు నక్సల్స్ హతమయ్యారు.
బీజాపూర్ జిల్లా పున్నూర్ గ్రామంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరో నక్సలైట్ హతమయ్యాడు. దంతెవాడ జిల్లా కుత్రెం అటవీ ప్రాంతంలో కూడా పోలీసులకు, మావోయిస్టులకు మధ్య భారీ కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఇద్దరు మోస్ట్ వాంటెడ్ నక్సల్స్ హతమయ్యారు. వారి తలపై రూ.5 లక్షల రివార్డు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనాస్థలం నుంచి పోలీసులు ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
ఎగ్జిట్ పోల్స్ తనను షాకింగ్ కు గురిచేశాయి: కేఏ పాల్