ప్రస్తుతం దేశం మొత్తం ఆనందయ్య కరోనా మందు గురించి మాట్లాడుకుంటుంది. ఆయన ఇప్పటికే చాలా మందికి మందు పంపిణీ చేయారు.. ఎలాంటి హానికర పదార్థాలు లేవని ఇప్పటికే తేల్చేరు అధికారులు.. అయితే, దీనిపై మరింత లోతుగా అధ్యయనం చేస్తున్నారు.. ప్రస్తుతం ఆయన ప్రభుత్వ అనుమతి కోసం వేచిచూస్తున్నారు. ఇదే సమయంలో.. ఏపీలో కొన్ని చోట్ల పసరు వైద్యులు తెరపైకి వచ్చారు.. పశ్చిమ గోదావరి జిల్లాలోనూ ఓ వ్యక్తి ఆయుర్వేద మందు పంపిణీ చేస్తున్నారంటూ.. పెద్ద ఎత్తున క్యూ కట్టారు ప్రజలు.. తాజాగా, కడప జిల్లా పులివెందులలో మరో ఆయుర్వేద వైద్యుడు తెరపైకి వచ్చారు.. కరోనా ఫస్ట్ వేవ్ సమయంలో సుమారు 3 లక్షల మందికి పసరు మందు అందించినట్టు చెబుతున్నారు పసరు వైద్యుడు వివేక్ యాదవ్.. పసరు మందు తీసుకున్న వారికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ రాలేదని చెప్పారు.. ఇక, పసరు మందు తీసుకున్న వారు అందరూ సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉన్నారని.. ప్రస్తుతం కోవిడ్ సీరియస్ కేసులు కూడా పసరు మందు తిన్నాక కుడుదపట్టారని వెల్లడించారు.. గత 30 ఏళ్ల నుండి వివిధ రోగాలకు ఆయుర్వేద మందులు తయారు చేస్తున్నట్టు చెబుతున్నారు వివేక్. చూడాలి మరి దీని పై ప్రభుత్వం ఏ ఇధమైన నిర్ణయం తీసుకుంటుంది అనేది.
previous post
next post