telugu navyamedia
సినిమా వార్తలు

సల్మాన్ పై ముద్దుల వ‌ర్షం కురిపించిన న‌టి ..

బాలీవుడ్‌ స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌ సోదరి అర్పిత ఖాన్‌, ఆమె భర్త ఆయుష్‌ శర్మ మంగళవారం గ్రాండ్ గా ఈద్ పార్టీని నిర్వహించారు ఈ పార్టీలో బాలీవుడ్‌ ప్రముఖులు తళుక్కుమని మెరిశారు.

ఈ ఈద్‌ పార్టీకి బిగ్‌బాస్‌ బ్యూటీ, నటి, సింగర్‌ షెహనాజ్‌​ గిల్‌ కూడా బ్లాక్ సూట్‌లో గ్లామరస్‌గా హాజరైంది.. పార్టీ నుండి బయలుదేరినప్పుడు, సల్మాన్ ఖాన్ , షెహనాజ్‌ షట్టర్‌బగ్‌లకు కూడా పోజులిచ్చారు.

Shehnaaz Gill Gets TROLLED For Kissing & Hugging Salman Khan At Eid Party,  Netizens Say 'She's Clearly Drunk, Why's She Behaving Like A Chichori'

ఈ సందర్భంగా సల్మాన్‌ను హగ్‌ చేసుకుంటూ అతడిపై ముద్దుల వర్షం కురిపించింది. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారగా పలువురు నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తాగిన వ్యక్తిలా ప్రవర్తిస్తోంది’, ‘సిద్దార్థ్‌ శుక్లా లేకుండానే ఈద్‌ జరుపుకుంటున్నానన్న బాధ ఇసుమంతైనా కనిపించడం లేదు’ అంటూ నానామాటలు అంటూ ఆమెను ట్రోల్స్‌ చేస్తున్నారు.

కాగా..సల్మాన్ ఖాన్ త‌రువాత చిత్రంలో షెహనాజ్ గిల్ కీలక పాత్ర పోషిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ‘కభీ ఈద్ కభీ దివాలీ’లో ఆయుష్ శర్మ సరసన షెహనాజ్ జంట‌గా న‌టిస్తున్న‌ట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ధృవీకరణ రాలేదు.

ఫర్హాద్ సంజీ దర్శకత్వం వహించిన ‘కభీ ఈద్ కభీ దివాలీ’ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుండగా, ఆయుష్ శర్మ కీలక పాత్ర పోషిస్తున్నారు. ‘కభీ ఈద్ కభీ దీపావళి’ ఈ ఏడాది డిసెంబర్‌లో విడుదల కానుంది.

 

Related posts