telugu navyamedia
సినిమా వార్తలు

తండ్రి కాబోతున్న అగ్ర నిర్మాత దిల్ రాజు..

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు కాబోతున్నాడా? అంటే.. అవుననే అంటున్నాయి తెలుగు ఇండస్ట్రీ వర్గాలు. టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా , డిస్ట్రిబ్యూటర్ గా రాజుకు ఉన్న పేరు మామూలుది కాదు. స్టార్ హీరోలందరితో సినిమాలు చేశారు.

2017లో దిల్ రాజు మొదటి భార్య శిరీష అనారోగ్యంతో అకాల మరణం చెందటం తెలిసిందే. దీంతో కరోనా లాక్ డౌన్ సమయంలో బంధువుల సమక్షంలో దిల్ రాజు, వైఘా రెడ్డి(తేజస్విని) మెడలో మూడు ముళ్ళు వేశాడు. 51 ఏళ్ల వయస్సులో రెండో వివాహం చేసుకున్నారు.

Dil Raju Marriage Photos, Wedding Videos & News: Dil Raju's MARRIAGE PHOTOS  are out! Ace producer ties the knot on Sunday night

ప్రస్తుతం దిల్ రాజు భార్య తేజస్విని నిండు గర్భిణీ అని, త్వరలోనే ఈ దంపతులు ఓ బిడ్డకు జన్మను ఇవ్వబోతున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

అయితే ఈ వార్తపై అధికారిక ప్రకటన లేనప్పటికీ, నిజమే అంటున్నారు ఇండస్ట్రీ వర్గాలు. ఇక ఇప్పటికే హన్షిత రెడ్డి కి పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నారు. తాత అయ్యాకా దిల్ రాజు మరోసారి తండ్రి కాబోతున్నాడు అన్నమాట. అయితే ఈ విషయం తెలియడంతో నెటిజన్లు దిల్ రాజుకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Related posts