telugu navyamedia
సినిమా వార్తలు

బాలీవుడ్ కు విజయ్ దేవరకొండ హీరోయిన్

Shalini Pandey images
“అర్జున్ రెడ్డి” సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది షాలిని పాండే. మొదటి సినిమాతోనే యూత్ లో భారీ క్రేజ్ ను సంపాదించుకుంది. ఈ సినిమా అనూహ్యమైన విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు ఆ సినిమాలో నటించిన నటీనటులకు, దర్శకుడికి, విజయ్ దేవరకొండకు, షాలిని పాండేకు మంచి పేరు వచ్చింది. దీంతో ఇక షాలిని తెలుగులో బిజీ కావడం ఖాయమని భావించారు అంతా. కానీ ఆమెకు ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. దీంతో తమిళ, హిందీ భాషల్లో తన ప్రయత్నాలు మొదలు పెట్టింది. అయితే బాలీవుడ్ లో షాలినీని ఓ భారీ ఆఫర్ వరించింది అనేది తాజా సమాచారం. పరేష్ రావల్ తనయుడు ఆదిత్య హీరోగా అనురాగ్ కశ్యప్ “బాంఫాడ్” అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో కథానాయికగా షాలినీ పాండేను ఎంపిక చేశారని తెలుస్తోంది. బాలీవుడ్ లో దర్శక నిర్మాతగా అనురాగ్ కశ్యప్ కి మంచి క్రేజ్ ఉంది. ఆయన దృష్టిలో పడితే ఆ హీరోయిన్ దశ తిరిగిపోయినట్లే. ఈ సినిమా హిట్ అయితే షాలిని బాలీవుడ్లోనే సెటిల్ అయ్యే అవకాశం ఉంది. 

Related posts