telugu navyamedia
తెలంగాణ వార్తలు

చివరి వరకు కాంగ్రెస్‌లోనే కొనసాగుతా- ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

తాను చివరి వరకు కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని ఆ పార్టీ కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. మీడియాతో ఆయన ఇక్కడ మాట్లాడారు. తాను చనిపోయినప్పుడు మూడు రంగుల జెండా కప్పమని చెప్పానన్నారు. నాది ఒకే మాట, ఒకే బాట అని ఆయన స్పష్టం చేశారు.

సోషల్ మీడియాలో తనపై అబద్ధపు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. తాను ప్రధానిని కలిసినంత మాత్రాన పార్టీ మారతాను అనడానికి సంకేతం కాదన్నారు. తాను చివరి వరకు కాంగ్రెస్‌లోనే కొనసాగుతానన్నారు.

సీఎం కేసీఆర్ అవినీతిపై ఫిర్యాదు చేసేందుకే ప్రధానిని కలిసానని, భవిష్యత్తులోను ప్రధానిని కలుస్తానని ఆయన స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో తనపై అబద్ధపు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. యూపీఏ హయాంలో జరిగిన కోల్ స్కామ్ కంటే ఇది ఇంకా పెద్దదన్నారు. ప్రగతి భవన్‌లో విభేదాల గురించి మీడియా రాయదని, కాంగ్రెస్‌కు సొంత మీడియా, డబ్బులు లేవు కాబట్టే వ్యతిరేకంగా రాస్తారని అన్నారు.

Telangana MP Komatireddy Venkat Reddy meets PM Modi with long list of 10  demands : Telangana: దాన్ని నేను వ్యతిరేకించట్లేదు.. కానీ..

తనకో, రేవంత్‌కో ఒక్కరోజు ఛాన్స్ ఇస్తే.. రైస్ సమస్యని పరిష్కరిస్తామంటూ కేసీఆర్‌కు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సవాల్ విసిరారు. రాష్ట్ర కాంగ్రెస్ లో నెలకొన్న విభేదాలపైన ఆయన మాట్లాడారు.

కాంగ్రెస్‌లో ఉన్న అంతర్గత విభేదాలనేవి మొగుడు పెళ్లాల మధ్య ఉన్న గొడవ లాంటివని ఆయన అభివర్ణించారు. `అన్ని అంశాలు సర్దుకుంటాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావటమే లక్ష్యంగా కృషి చేస్తామని కోమటిరెడ్డి స్పష్టం చేశారు.

Related posts