telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

చిరంజీవి గారి సినిమాలో భాగమైనందుకు చాలా గర్వంగా ఉంది… నటుడు సోనూ సూద్

sonusood

మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.ఇప్పటికే ఈ మూవీలో ఓ కీలక పాత్రలో నటించేందుకు సూపర్‌స్టార్ మహేష్ బాబు ఓకే చెప్పారట. అంతేకాదు 30రోజుల క్యాల్షీట్లు కూడా ఇచ్చినట్లు సమాచారం. తాజాగా ఈ మూవీలో భాగమయ్యారు మరో నటుడు సోనూ సూద్. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన సోనూ సూద్.. “చిరంజీవి గారి సినిమాలో భాగమైనందుకు చాలా గర్వంగా ఉంది. దక్షిణాది సినిమా ఇండస్ట్రీ నాకు ఎంతో ప్రేమను ఇచ్చింది. ఈ చిత్రం ద్వారా వారికి మరోసారి నా ప్రేమను ఇస్తానని నమ్ముతున్నా” అని అన్నారు. కాగా సినిమాలోని ఓ కీలక పాత్రలో సోనూ సూద్ నటించబోతున్నారని, ఈ పాత్ర కచ్చితంగా ఆయనకు మంచి పేరు తీసుకొస్తుందని సమాచారం. ఏదేమైనా చిరు మూవీపై వస్తోన్న వార్తలను చూస్తుంటే.. ఫ్యాన్స్ అంచనాలకు మించి కొరటాల ఈ ప్రాజెక్ట్‌ను తెరకెక్కించబోతున్నట్లు అర్థమవుతోంది. కాగా ఈ మూవీలో చిరు సరసన త్రిష నటిస్తోంది. రెజీనా ఓ ప్రత్యేక పాత్రలో మెరవనుంది.

Related posts