telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ

మద్యనిషేధం మొదటి భాగం : .. బెల్టు షాపులకు .. మద్యం సరఫరా నిలిపివేత..

alcohol prohibition in AP 20% every year

మద్యనిషేధం లో మొదటి భాగం ఆచరణలోకి వస్తున్నట్టే తోస్తుంది.. తాజాగా, రాజంపేట లో మద్యం షాపు యజమానులు బెల్ట్ షాపులకు మద్యం సరఫరా చేస్తే కఠిన చర్యలు తప్పవని అర్బన్ సిఐ శుభ కుమార్ హెచ్చరించారు. అర్బన్ పిఎస్ లో మద్యం షాపుల, పెట్రోల్ బంక్, డాబాల యజమానులతో మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శుభ కుమార్ మాట్లాడుతూ.. దుకాణాల యజమానులు లైసెన్సు నియమ నిబంధనలకు అనుగుణంగా నడపాలని కోరారు.

అనుమతి ఇచ్చినంతవరకే దుకాణాలు తెరిచి వ్యాపారాలు చేసుకోవాలని, అంతకు మించితే చర్యలు తీసుకోవాల్సి వస్తుందని అన్నారు. జిల్లా ఎస్పీ ఇచ్చిన సూచనలను అందరూ పాటించాలని సూచించారు. షాప్ యజమానులు సి సి కెమెరాలు ఏర్పాటు చేసి మానేటిరింగ్ చెయ్యాలని కోరారు. బెల్టుషాప్ లకు మందు సరఫరా చేస్తే కేసులు నమోదు చేస్తామని తెలిపారు.

Related posts