telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మరోసారి తన ఉదారతను చాటుకున్నషారుక్‌ … 25 వేల పీపీఈ కిట్లు అందజేత

Sharukh

కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలులో ఉంది. కరోనా వైరస్‌ను ఎదుర్కోవటానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరంతరం కొత్త నిర్ణయాలు తీసుకుంటున్నాయి. బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ షారుక్‌ ఖాన్‌ మరోసారి తన ఉదారతను చాటుకున్నాడు. కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు పోరాటం చేస్తున్న మహారాష్ట్రలోని ఫ్రంట్‌లైన్ హెల్త్‌కేర్‌ వర్కర్లకు తన వంతు సహాయంగా 25వేల పర్సనల్‌ ప్రొటక్షన్‌ ఎక్విప్‌మెంట్‌ కిట్లను అందించాడు. ఇదే విషయమై మహారాష్ట్ర ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి రాజేష్ తోపే స్పందిస్తూ షారుక్‌కు ట్విటర్‌ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. ‘ థాంక్యూ షారుక్‌.. మీ వంతుగా 25వేల పీపీఈ కిట్లను అందించినందుకు ధన్యవాదాలు. కరోనా మహమ్మారిపై పోరాడుతున్న మెడికల్‌ సిబ్బందికి ఇవి ఎంతగానో ఉపయోగపడుతాయంటూ’ ట్విటర్‌లో పేర్కొన్నాడు.

దీనిపై షారుక్‌ స్పందిస్తూ.. ‘ నేనిచ్చిన కిట్లను హెల్త్‌ వర్కర్లకు వినియోగిస్తునందుకు మీకు ధన్యవాదాలు. అయినా దేశమంతా ఒకే కుటుంబంగా ఉంటూ కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు ప్రయత్నిస్తున్నాం. ఇలాంటి ఆపత్కాల సమయంలో నా వంతుగా సహాయం చేశా. కరోనాను తరిమికొట్టేందుకు శాయశక్తులా కృషి చేస్తున్న వైద్య రంగం, వారి కుటుంబసభ్యులు ఆరోగ్యంగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా’ అంటూ రీట్వీట్‌ చేశాడు. అంతకుముందు షారుక్‌ భార్య గౌరీఖాన్‌ తమ నాలుగంతస్తుల ఆఫీస్‌ బిల్డింగ్‌ను క్వారంటైన్‌ సెంటర్‌గా మార్చుకునే అవకాశం ఇస్తున్నట్లు బృహత్‌ ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌కు లేఖను అందజేశారు. క్వారంటైన్‌ సెంటర్లో మహిళలకు, చిన్నపిల్లలతో పాటు, మిగతావాళ్లకు కూడా అవసరమైన అన్ని రకాల సదుపాయాలు ఏర్పాటు చేసినట్లు లేఖలో పేర్కొన్నారు.

Related posts