telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

వైసీపీ తీర్థం పుచ్చుకున్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే…

వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు మరో టీడీపీ మాజీ ఎమ్మెల్యే. మాజీ ఎమ్మెల్యే ఫిలిప్‌ సి. తోచర్‌… సీఎం చేతుల మీదుగా వైసీపీ కండువా క‌ప్పుకున్నారు.. ఇక‌, ఈ కార్య‌క్రమంలో ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు కత్తెర సురేష్, కత్తెర హెన్రీ క్రిస్టినా పాల్గొన్నారు.. కాగా, ఈ ఏడాది జ‌న‌వ‌రిలో టీడీపీకి రాజీనామా చేశారు ఫిలిప్‌ సి. తోచర్‌… క్రైస్తవ మతం పట్ల చంద్రబాబు వివాదాస్పద వ్యాఖ్యలు చేశార‌ని ఆరోపించిన ఆయ‌న‌.. తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్న‌ట్టుగా టీడీపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు లేఖ పంపారు.. ఇక‌, ఆ త‌ర్వాత మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు వైఖరి, ఆ పార్టీ వైఖరి అసహ్యం పుట్టిస్తుంద‌ని.. రామతీర్థం, ఇతర దేవాలయాల్లో జరిగిన ఘటనలకు క్రైస్తవానికి ఎటువంటి సంబంధం లేకపోయినా.. రాజకీయాల కోసం క్రైస్తవులను అవమానిస్తున్నారన్నారంటూ ఆయ‌న గ‌తంలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన సంగ‌తి తెలిసిందే.

Related posts