పాకిస్థాన్ రైల్వే మంత్రి షేక్ రషీద్ కు ఊహించని ఘటన జరిగింది. ఇస్లామాబాద్ లో ఓ ర్యాలీలో మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు చేశారు. కశ్మీర్ విషయంలో మోదీ ఏమనుకుంటున్నారో మాకు తెలుసు అంటూ వ్యాఖ్యానిస్తుండగా అకస్మాత్తుగా పాదాలు కంపించిపోయారు. కాళ్ల వద్ద ఉన్న వైర్లు తాకడంతో ఆయన విద్యుదాఘాతానికి గురయ్యారు. ఒక్కసారిగా ఆందోళనకు గురై వెంటనే అప్రమత్తమయ్యారు. అనంతరం ఈ సమావేశాన్ని మోదీ అడ్డుకోలేరని పాక్ మంత్రి వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి.