telugu navyamedia
క్రీడలు వార్తలు

నా లక్ష్యం సెంచరీలు కాదు… జట్టు గెలుపు : రహానే

ఈరోజు భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఐసీసీ ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌ 2021 ఆరంభం కానుంది. ఇంగ్లండ్‌లోని సౌథాంప్టన్ వేదికగా ఈ టైటిల్‌ పోరు జరగనుంది. డబ్ల్యూటీసీ ఫైనల్‌ సందర్భంగా అజింక్య రహానే మాట్లాడుతూ… ‘అందరికంటే ఎక్కువ పరుగులు చేయడం ప్రత్యేకమే. కానీ జట్టు విజయం కోసం ఎన్ని పరుగులు చేశామన్నదే నాకు ముఖ్యం. ప్రతిసారీ నేను అదే ఆలోచిస్తాను. విమర్శలకు నేను సంతోషిస్తాను. నిజానికి వాటివల్లే నేనిక్కడ ఉన్నాను. విమర్శలు వచ్చినా.. రాకున్నా అత్యుత్తమంగా ఆడేందుకే ప్రయత్నిస్తాను. నిజం చెప్పాలంటే వాటిని నేను పెద్దగా పట్టించుకోను. ఒక బ్యాట్స్‌మన్‌గా లేదా ఫీల్డర్‌గా దేశం కోసం కష్టపడతాను’ అని అన్నాడు. టెస్టు ఛాంపియన్‌షిప్‌లో 17 మ్యాచులాడిన జింక్స్ 1095 పరుగులు చేశాడు. ‘విమర్శలు చేయడం విమర్శకుల పని. క్రికెట్ ఆడడం నా పని. అందుకే నా నియంత్రణలో లేని వాటి గురించి ఆలోచించను. నా బ్యాటింగ్‌ ప్రక్రియపై దృష్టి పెట్టి పరుగులు చేసేందుకు ప్రయత్నిస్తాను. నేనెప్పుడూ నా సహజ శైలిలోనే ఆడతాను. నేను సెంచరీ చేసినా చేయకపోయినా జట్టు గెలవడమే మాకు ముఖ్యం. అందుకే ప్రతిసారీ వంద చేయాలన్న ఒత్తిడి నాపై ఉంచుకోను అన్నారు.

Related posts