telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు

పావురాల బెడద అంటున్న ఆ వ్యక్తిని అవేం చేశాయంటే…!?

Pegion

అమెరికా, ఇల్లినాయ్ రాష్ట్రం హౌజ్ ఆఫ్ రెప్రజెంటేటీవ్స్ సభ్యుడైన జైమీ ఆండ్రే.. స్థానిక ఇర్వింగ్ పార్కులో ఇటీవలే ఓ టీవీ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. అక్కడ పరిసరాల్లో పావురాల బెడద పెరిగిపోయిందని, రోడ్డంతా పావురాయి రెట్టలు, ఈకలతో నిండిపోయి పరిసరాలు అపరిశుభ్రంగా తయారయ్యాయని ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ కారణంగా పాదచారులకు ఆ ప్రాంతంలో నడవడం కూడా ఇబ్బందిగా మారిందని అభిప్రాయపడ్డారు. కాగా, ఆయన ఈ మాటలు మాట్లాడుతున్న సమయంలో ఆయన నెత్తిపైన ఓ పావురం రెట్ట వేసింది. దీంతో పావురాయి పగ తీర్చుకుందంటూ నెట్టింట్లో ఆయనపై జోకులు వేసుకుంటున్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

Related posts