telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కియారాకు ప్రియుడి స్పెషల్ గ్రీటింగ్స్

Kiara

2014లో తొలిసారిగా కియారా అద్వానీ ‘ఫగలీ’ సినిమాతో బాలీవుడ్‌లో కాలు మోపారు. కానీ అక్కడ సరైన హిట్ ను అందుకోలేకపోయింది ఈ బ్యూటీ. ఆ తరువాత తెలుగులో ‘భరత్ అనే నేను’, ‘వినయ విధేయ రామ’ సినిమాల్లో నటించి మంచి గుర్తింపును సొంతం చేసుకుంది. బాలీవుడ్ లో అర్జున్ రెడ్డి రీమేక్ “కబీర్ సింగ్” చిత్రంతో స్టార్ హీరోయిన్ గా క్రేజ్ తెచ్చుకుంది కియారా అద్వానీ. ఆ తరువాత వరుస సినిమాలతో దూసుకెళ్తోంది ఈ హాట్ బ్యూటీ. తాజాగా కియారా అద్వానీ 28వ పుట్టినరోజును జరుపుకుంది. ఈ సందర్భంగా ఆమె ఫ్యాన్స్, స్నేహితులు, సహచరులు అందరూ చెప్పిన శుభాకాంక్షలతో ఆమె సోషల్ మీడియా ఖాతాలు నిండిపోయాయి. అయితేబాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా నుంచి వచ్చిన గ్రీటింగ్స్ మాత్రం అందరి దృష్టిని ఆకర్షించాయి. సిద్ధార్థ్ తో కియరా డేటింగ్ చేస్తోందనే వార్తలు గత కొంత కాలంగా బీటౌన్ లో షికార్లు చేస్తున్నాయి. కియరా పుట్టిన రోజు సందర్భంగా తన ఇన్స్టాగ్రామ్ పేజ్ లో సిద్ధార్థ్ ఇలా రాసుకొచ్చాడు. ‘హ్యాపీ బర్త్ డే సన్ షైన్ గర్ల్. బిగ్ లవ్ అండ్ హగ్స్’ అని రాశాడు. కియరా ఫొటోను షేర్ చేశాడు. ఈ గ్రీటింగ్స్ కు కియరా స్పందిస్తూ… ‘థ్యాంక్యూ మంకీ’ అని సరదాగా రిప్లై ఇచ్చింది.

Related posts