*బంజారాహిల్స్ పీఏస్ దగ్గర నటి హేమ హాల్ చల్..
*నాపేరు ఎందుకు బయటకు తీసారు..
*సినిమా వాళ్లపై బురద జల్లుతారు..
*సినిమా వారి పేర్లను హైలెట్ చేస్తున్నారు..
హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని రాడిసన్ బ్లూ ప్లాజా హోటల్‌లోని ఫుడింగ్ అండ్ మింక్ పబ్‌లో డ్రగ్స్ వ్యవహారం ప్రకంపనలు రేపుతోంది. ఆదివారం తెల్లవారుజామున పబ్‌పై టాస్క్‌ఫోర్స్ పోలీసులు రైడ్ నిర్వహించి.. పబ్ యజమానులతో సహా సుమారు 150 మందిని అదుపులోకి తీసుకున్నారు.
పట్టుబడిన వారిలో పలువురు రాజకీయ ప్రముఖులు, సెలబ్రిటీల పిల్లలు ఉన్నారని తేలడంతో ఆసక్తికరంగా మారింది. మాజీ ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు, సినీనటుడు కుమార్తె నిహారికతో సహా ప్రముఖ సింగర్ సిప్లిగంజ్ ఉన్నట్లు తెలుస్తుంది.
అయితే ఈ కేసులో ‘‘నేను అసలు పబ్‌కే వెళ్లలేదు.. నా పేరు ఎందుకు బయటకు తెచ్చారంటూ సినీ నటి హేమ ఏకంగా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ దగ్గర హల్ చల్ చేశారు.
డ్రగ్స్ కేసు అనేది చిన్న విషయం కాదు. ఈ కేసుతో నాకు ఎలాంటి సంబంధం లేకపోయినప్పటికీ కొందరు కావాలనే నా పేరుని ప్రసారం చేస్తున్నారు. నన్ను బద్నాం చేస్తున్నారని మండిపడ్డారు. తన గురించి తప్పుగా ప్రచారం చేసిన ఓ న్యూస్ ఛానెల్ పై బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ వ్యవహారంలో సినిమా వాళ్లు ఫోకస్ అవుతారు కాబట్టే మాపై బురదజల్లుతున్నారు. హైదరాబాద్ డ్రగ్స్ ఫ్రీ సిటీగా మార్చాలి. డ్రగ్స్ వ్యవహారంపై ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం చాలా సీరియస్ గా యాక్షన్ తీసుకుంటుంది. డ్రగ్స్ వాడిన వాళ్లని చెప్పుతో కొట్టాలి. డ్రగ్స్ అంటే సినిమా వాళ్లు ఫోకస్ అవుతారు. చిన్న పిల్లలు దగ్గర నుంచి గంజాయి, డ్రగ్స్ తీసుకుంటున్నారు. వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను అని నటి హేమ అన్నారు.
పవన్ పై కత్తి మహేష్ వివాదాస్పద వ్యాఖ్యలు