జిల్లా మహిళాభివృద్ధి & చైల్డ్ వెల్ఫేర్ విభాగం అంగన్వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా అంగన్వాడీ వర్కర్ (టీచర్), అంగన్వాడీ హెల్పర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. 10వ తరగతి అర్హత ఉన్న ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. వివాహితులై ఉండాలి. సరైన అర్హతలు ఉన్న అభ్యర్థులు నవంబరు 21 అంటే గురువారం నుండి 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 489 పోస్టులు ఖాళీలు ఉండగా అందులో అంగన్వాడీ కార్యకర్త (వర్కర్) 63 పోస్టులు, మినీ అంగన్వాడీ కార్యకర్త (వర్కర్) పోస్టులు 83, అంగన్వాడీ సహాయకులు (హెల్పర్) పోస్టులు 343 ఉన్నాయి.
ఈ పోస్టులకు అర్హతలు పదోతరగతి ఉత్తీర్ణులై ఉండాలి. వివాహితులైన స్థానికులు మాత్రమే ఈ పోస్టులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అంటే అంగన్వాడీ ఉన్న గ్రామంలో స్థానికులై ఉండాలి. ఈ పోస్టులకు వయోపరిమితి 01.07.2019 నాటికి 21 – 35 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ ప్రాంతాల్లో 21 సంవత్సరాలు ఉన్న అభ్యర్థులు అందుబాటులో లేని పక్షంలో 18 సంవత్సరాలు నిండినవారు కూడా అర్హులు.