telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బాటిల్ క్యాప్ ఛాలెంజ్ ని ముందుగా చేసింది బ్రూస్ లీనే… ఇదిగో సాక్ష్యం

Bruce-Lee

ప్రస్తుతం సోషల్ మీడియాలో “బాటిల్ క్యాప్ ఛాలెంజ్” వైరల్ అవుతోంది. కికీ ఛాలెంజ్, ఐస్ బకెట్ ఛాలెంజ్ అంటూ రకరకాల ఛాలెంజ్‌లు యూత్‌ని ఉర్రూతలూగించాయి. ఇప్పుడు ఈ కొత్త ఛాలెంజ్ యూత్ ను అట్ట్రాక్ట్ చేస్తోంది. ఈ ఛాలెంజ్ లక్ష్యం ఏంటంటే ఓ టేబుల్‌పై బాటిల్‌ను పెట్టి, దానికి కొద్ది దూరంలో నిలబడి మూతను బాటిల్ కింద పడకుండా తన్నాలి. తాజాగా బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ఈ ఛాలెంజ్ లో సక్సెస్ అయ్యానంటూ వీడియో పోస్ట్ చేశారు. దీంతో ప్రముఖులతో పాటు యూత్ కూడా ఈ ఛాలెంజ్ ను స్వీకరిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ట్రెండింగ్ అవుతోన్న ఈ ఛాలెంజ్ ను మార్షల్ ఆర్ట్స్ పితామహుడు బ్రూస్ లీ ఎప్పుడో పూర్తిచేశాడని ఆయన కుమార్తె షానన్ లీ చెబుతున్నారు. అందుకు నిదర్శనంగా, ఓ వీడియోను బ్రూస్ లీ పేరిట ఉన్న అధికారిక ట్విట్టర్ అకౌంట్ లో షేర్ చేశారు. ఇప్పటి చాలెంజ్ కు భిన్నంగా బ్రూస్ లీ నాన్ చాక్ తో మూడు బాటిళ్ల మూతలు అలవోకగా తెరవడం ఆ వీడియోలో కన్పిస్తోంది.

Related posts