telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

అటుకులతో ఇలా ఒక్కసారి చేసుకుంటే ఇంక మర్చిపోరు..

ఈ మధ్య కాలంలో జనాలు ఈజీగా ఉండే టిఫిన్స్ చేసుకోవడానికి ఎక్కువ ఇష్టపడతారు.. అయితే ఏది చేసుకోవాలో తెలియదు. అలాంటి వాళ్ళు అటుకులతో ఉప్మా చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది..ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..

కావలసిన పదార్థాలు:

అటుకులు : ఒకకప్పు

కరివేపాకు : రెండు రెబ్బలు

కొత్తిమీర : రెండు రెబ్బలు

ఉల్లిపాయ: ఒకటి

పచ్చిమిర్చి : నాలుగు

ఉప్పు : తగినంత

పసుపు : ఒక స్పూన్

నూనె : రెండు స్పూన్లు

తయారీ విధానం:

ముందుగా అటుకులను ఒక బౌల్ లో వేసి నీళ్లు పోసి కడిగి పక్కన పెట్టుకోవాలి.. పాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసి , పచ్చిమిర్చి ముక్కలు, ఆనియన్ ముక్కలు వేసి దోరగా వేయించుకోవాలి.తర్వాత కొద్దిగా కరివేపాకు, పసుపు, ఉప్పు వేసి బాగా కలపాలి. తర్వాత అటుకులను వేసి మొత్తం మిశ్రమాన్ని బాగా కలపాలి.. చివరగా కొత్తమీరతో గార్నిష్ చేసుకోవాలి. అంతే చాలా రుచిగా ఉండే అటుకుల ఉప్మా రెడీ..మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి.. 

Related posts