telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

ముఖం పై నల్లటి మచ్చలు పోవాలంటే ఈ టిప్స్ పాటించాల్సిందే..

ప్రస్తుత కాలంలో పెగుతున్న కాలుష్యం వల్ల మనుషులు అనేక రకాల సమస్యలు తలెత్తుతున్నాయి.. యువతను బాధపెట్టే ఒకే సమస్య మొటిమలు..ఇవి వచ్చినప్పుడు ఎంతగా భాదిస్తాయో..అవి తగ్గిన తర్వాత ఏర్పడే మచ్చలు కూడా ఎక్కువ ఇబ్బంది పెడతాయి..అయితే పెసరపప్పు తో మొటిమలు తగ్గుతాయని నిపుణులు అంటున్నారు..అది ఎలానో ఇప్పుడు చూద్దాం..

పెసలలో ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి.వీటిని తీసుకోవడం శరీరానికి శక్తిని అందిస్తుంది. అలాంటి పెసరపప్పుతో ముఖానికి ప్యాక్ వేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.ఒక గుప్పెడు పెసలని రాత్రంతా పచ్చిపాలలో నానబెట్టి, పొద్దున్న వాటిని మెత్తగా రుబ్బండి. ముఖం శుభ్రంగా కడుక్కున్న తరువాత ఈ పేస్ట్ అప్లై చెసి పదిహేను-ఇరవై నిమిషాల పాటూ ఉంచెయ్యండి. ఇది ఆరిపోయిన తరవాత నీటితో కడిగేసి ముఖాన్ని మెత్తటి బట్టతో క్లీన్ చేసుకోండి. ఇలా చేస్తే చర్మం మృదువుగా తయారౌతుంది. ఇలా రెగ్యులర్‌గా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇంక ఆలస్యం ఎందుకు మీరు ట్రై చేయండి..

Related posts