telugu navyamedia
సినిమా వార్తలు

13 ఏళ్ళ తరువాత లైలా రీఎంట్రీ

Laila

“ఎగిరే పావురమా” చిత్రంతో తెలుగు తెర‌కి ప‌రిచ‌యమై 1990-2000 మ‌ధ్య కాలంలో ఇటు తెలుగు, అటు త‌మిళ ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రించిన అందాల భామ లైలా. “పెళ్లిచేసుకుందాం”, “పవిత్రప్రేమ”, “ఉగాది”, “ఖైదీగారు” వంటి చిత్రాల్లో కూడా నటించి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఈమె గ్లామర్ కు అప్పటి కుర్ర కారు ఫిదా అయిపోయేవారు. మలయాళ, కన్నడ, హిందీ భాషలలోను ప‌లు సినిమాలు చేసిన లైలా దాదాపు 50 సినిమాల వరకూ చేసింది. తెలుగులో ఈమె నటించిన చివరి చిత్రం “మిస్టర్ అండ్ మిసెస్ శైలజా కృష్ణమూర్తి”. తాజాగా ఓ టీవీ షోలో పాల్గొన్న లైలా త్వ‌ర‌లో రీఎంట్రీ ఇస్తున్న‌ట్టు చెప్పుకొచ్చింది. బైలింగ్యువ‌ల్ మూవీతో రీఎంట్రీ ఉంటుంద‌ని ఆమె చెప్పుకొచ్చారు. చిత్ర వివ‌రాలు అతి త్వ‌ర‌లోనే వెల్లడించ‌నున్న‌ట్టు లైలా పేర్కొంది. 2006లో మెహ‌దీన్‌ని వివాహం చేసుకొని సినిమాల‌కి దూర‌మైన లైలా మ‌ళ్ళీ 13 ఏళ్ళ త‌ర్వాత రీ ఎంట్రీ ఇస్తుండ‌డం విశేషం. ఇటీవ‌ల “పవిత్ర ప్రేమ” కో స్టార్ బాల‌య్య‌తో పాటు సోనాల్ చౌహ‌న్‌తో క‌లిసి లైలా ఫోటోకి ఫోజులిచ్చింది. ఆ ఫోటో కొద్ది రోజుల క్రితం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది.

Related posts