telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

బెంగళూరు డ్రగ్స్ కేసులో ట్విస్ట్ !!

బెంగళూరు డ్రగ్స్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. మొన్నటి వరకు సినీ ప్రముఖులు ఈ కేసులో చిక్కుకోగా.. ఇప్పుడు ఎమ్మెల్యే చుట్టు ఉచ్చు బిగిసుకుంటోంది. ఈ కేసు విచారణలో పారిశ్రామికవేత్తలతోపాటు కొంతమంది సినీ ప్రముఖుల పేర్లు వెలుగులోకి వచ్చాయి. వీరిలో హైదరాబాద్‌కు చెందిన వారు కూడా ఉన్నారు. వ్యాపారవేత్త సందీప్‌ రెడ్డిని ప్రశ్నించిన బెంగళూరు పోలీసులకు తెలంగాణకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు.. శాండిల్‌వుడ్‌, టాలీవుడ్‌కు చెందిన వారి పేర్లు తెలిశాయట. అయితే ఒక ఎమ్మెల్యే పేరు మాత్రమే అతను చెప్పాడట. మిగతా ముగ్గురు ఎవరో వెల్లడించలేదట. హైదరాబాద్‌కు ఆనుకుని ఉన్న నియోజకవర్గానికి చెందిన ఆ ఎమ్మెల్యే ఎప్పుడూ తన దగ్గరకు వచ్చేవారని .. డ్రగ్స్‌ కూడా తీసుకెళ్లేవారని సందీప్‌ చెప్పడంతో విచారణాధికారులు అలర్ట్‌ అయ్యారు. ఆ ఎమ్మెల్యేకు సన్నిహితంగా ఉన్న మరో ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా డ్రగ్స్ తీసుకున్నట్టు పోలీసులు గుర్తించినట్టు సమాచారం. ఆ ఎమ్మెల్యేలు ఎవరన్నదే తెలుగు రాష్ట్రాల్లో చర్చగా మారింది. కాకపోతే కొన్ని లీకులు బయటకొస్తున్నాయి. వారు ఎవరన్నది ఆసక్తిగా మారింది.

మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే సోదరుడి పాత్ర కూడా ఈ కేసులో ఉన్నట్టుగా చెబుతున్నారు. ఆ ఎమ్మెల్యే సోదరుడికి హైదరాబాదులో వ్యాపారాలు ఉన్నాయి. ఆ ముగ్గురు శాసనసభ్యులు ఆ ఎమ్మెల్యేతో అత్యంత సన్నిహితంగా ఉన్నట్టు సమాచారం. హైదరాబాద్‌, బెంగళూరు నగరాల్లో డ్రగ్స్‌కు బానిసలుగా మారిన వారిలో గతంలో ప్రజాప్రతినిధుల వారసుల పేర్లు బయటకొచ్చేవి. ఇప్పుడు ఏకంగా ఎమ్మెల్యేల పేర్లు వినిపిస్తుండటంతో కలకలం రేగుతోంది. హైదరాబాద్‌లో రాజకీయ అలజడికి కారణం అవుతోంది. కర్నాటకలో రియల్‌ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్న అధికార పార్టీ నేతలపై కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారట. ఇది అలాంటి వారికి ఇబ్బందిగా మారినట్టు సమాచారం. బెంగళూరు పోలీసులు పేర్లు బయటకు చెప్పే వరకు తమకు ఈ సంకటం తప్పదనే ఆందోళనలో ఉన్నారట. ఒక ఎమ్మెల్యే తెలంగాణ ఉద్యమకారుడిగా చెప్పుకొన్నారట. అయితే ఆ ఎమ్మెల్యే ఎవరన్నది ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఈ ఎపిసోడ్‌ నలుగురు ఎమ్మెల్యేల దగ్గరే ఆగుతుందో.. ఇంకా మరికొందరి పేర్లు జాబితాలో చేరతాయో కానీ.. డ్రగ్స్‌తో సంబంధంతో ఉన్న వారిలో గుబులు మొదలైందట. 

Related posts