telugu navyamedia
క్రైమ్ వార్తలు

శుభకార్యానికి వెళ్తుండగా లోయలో పడ్డ బస్సు.. ఎనిమిది మంది మృతి

*స్పాట్ ఏడుగురు మృతి..ఆస్పత్రిలో మ‌రొక‌ర‌రు మృతి..
*బాకరాపేట ఘాట్ రోడ్డు వద్ద ప్ర‌మాదం

*ఈ రోజు నిశ్చితార్ధానికి హాజ‌రుకావాల్సి ఉండ‌గా ప్ర‌మాదం.

ఏపీలోని చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మదనపల్లె – తిరుపతి జాతీయ రహదారిపై భాకరాపేట కనుమలోని భారీ మలుపు వద్ద శనివారం రాత్రి ప్రైవేటు ట్రావెల్స్ బస్సు లోయలో పడింది. ఈ దుర్ఘటనలో మహిళ, చిన్నారి సహా ఎనిమిది మంది మృతి చెందారు. ఘటనాస్థలిలో ఏడుగురి మృతిచెంద‌గా..మ‌రొక‌రు ఆస్ప‌త్రిలో చికిత్స‌పొందుతూ మృతి చెందారు.

వివ‌ర్లాలోకి వెళితే..

ధర్మవరంలోని రాజేంద్రనగర్‌కు చెందిన వేణు అనే యువకుడికి చిత్తూరు జిల్లా నారాయణవనం ప్రాంతానికి చెందిన యువతితో పెళ్లి చేసేందుకు పెద్దలు నిశ్చయించారు. ఈ క్రమంలో శనివారం రాత్రే పెళ్లిబృందం ధర్మవరం నుండి ఓ ప్రైవేట్ బస్సులో బయలుదేరగా తిరుపతి సమీపంలో ప్రమాదానికి గురయ్యింది. బాకరాపేట వద్ద ఘాట్ రోడ్డుపై వెళుతుండగా ఒక్కసారిగా అదుపుతప్పిన బస్సు లోయలోకి పడిపోయింది.

ఈ ప్రమాదంలో 8 మంది మృతి చెందగా, 45 మంది తీవ్రంగా గాయపడ్డారు .ప్రమాద సమయంలో 55 మంది బస్సులో ఉన్నారు.  

మృతులు మలిశెట్టి వెంగప్ప (60), మలిశెట్టి మురళి (45), కాంతమ్మ (40), మలిశెట్టి గణేశ్‌ ‍‌(40), జె.యశశ్విని(8) డ్రైవర్‌ నబీ రసూల్‌, క్లీనర్‌ మృతి చెందినట్లు గుర్తించారు.రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదినారాయణరెడ్డి అనే వ్యక్తి మృతి చెందారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమం ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.

ప్రమాదస్థలంలో రక్తసిక్తమైన మృతదేహాలు, క్షతగాత్రుల రోదనలతో, భయానక వాతావరణం నెలకొంది.

Related posts