దేశవ్యాప్తంగా ఎన్నికల సందర్భంగా నోట్ల కట్టలు గుట్టలుగుట్టలుగా బయటపడుతున్నాయి. తెలంగాణలోని హైదరాబాద్ లో ఈరోజు భారీగా నగదు బయటపడింది. నగరంలోని లంగర్ హౌస్ ప్రాంతంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఓ కారులో కొందరు వ్యక్తులు అనుమానాస్పదంగా వ్యవహరించడంతో సదరు వాహనంలో సోదాలు చేపట్టారు.
ఈ తనిఖీలలో కారులో దాచిన రూ.2.4 కోట్లను స్వాధీనం చేసుకున్నారు. వాహనంలో వెళుతున్న ఆరుగురిని అరెస్ట్ చేయడంతో పాటు కారును సీజ్ చేశారు. ఈ నగదును ఎవరు పంపారు? ఎవరికి అందించేందుకు తీసుకెళుతున్నారు? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.