telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

గుండు లుక్ ఈ సినిమా కోసమే… అసలు విషయం బయటపెట్టిన చిరు

Chiru

ఇటీవలే ‘సైరా నరసింహా రెడ్డి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మెగాస్టార్ చిరంజీవి ఎప్పటికప్పుడు డిఫరెంట్ లుక్స్‌తో ఆశ్చర్యపరుస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల గుండుతో దర్శనమిచ్చి అందరినీ సర్‌ప్రైజ్ చేశారు. తన అర్బన్ మాంక్ లుక్ వెనకున్న సీక్రెట్ ప్రాస్థటిక్ మేకప్ అని తెలియజేస్తూ చిరంజీవి ఓ వీడియో విడుదల చేసి తన లుక్‌పై వస్తున్న రూమర్స్‌కు చెక్‌ పెట్టారు. అయితే అసలు చిరంజీవి గుండు లుక్‌ ఎందుకోసం ? అనే డౌట్ అందరిలోనూ ఉండిపోయింది. ప్రస్తుతం ‘ఆచార్య’ సినిమా చేస్తున్న చిరు, తదుపరి చేయబోయే ‘వేదాళం’ రీమేక్‌ కోసమే ఈ గుండు లుక్‌ను ప్రయత్నిస్తున్నారని టాక్‌ కూడా వినిపించింది. లేటెస్ట్‌గా ఓ ఇంటర్వ్యూలో మెగాస్టార్‌ చిరంజీవి తన గుండు లుక్‌పై క్లారిటీ ఇచ్చారు. ‘వేదాళం’ రీమేక్‌ కోసమే గుండు లుక్‌ను ట్రై చేస్తున్నట్లు, అయితే ఆ లుక్‌ ఇంకా ఫైనలైజ్‌ కాలేదని చిరు తెలిపారు.

Related posts