ముంబై మహానగరంలో నడుస్తున్న లోకల్ రైలులో ఈ రోజు ఉదయం అగ్నిప్రమాదం జరిగింది. వాషి స్టేషన్ వద్ద కు రైలు చేరుకున్న సమయంలో ఈ ఘటన జరిగింది. పన్వేల్-సీఎస్ఎంటీ లోకల్ రైలులో ఈ ప్రమాదం జరిగింది. అగ్ని ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు.
దీంతో హార్బర్ లైను రూట్లో లోకల్ ట్రైన్లు పది నిమిషాలు ఆలస్యం నడుస్తున్నాయి. రైలు బోగీపై ఉన్న పాంటోగ్రాఫ్ నుంచి భారీగా పొగ ఎగిసిపడింది. ఆ ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తి బ్యాగును పడివేయడం వల్ల అగ్ని ప్రమాదం జరిగినట్లు అధికారులు గుర్తించారు. కాలిన బోగీని భద్రతా కారణాల దృష్ట్యా షెడ్డుకు పంపించారు.