ఆసక్తిగా సాగుతున్న బిగ్ బాస్ షో లో దొంగలు దోచిన నగరం టాస్క్ లో భాగంగా వితిక హౌస్ మేట్స్ పై ఒక రేంజ్ లో రెచ్చిపోయింది. దీనితో వరుణ్ సందేశ్ వితిక ప్రవర్తన పై వితికకి చెప్తున్నాడు.వీరిద్దరి మధ్య ఒకానొక సమయంలో బీకరమైన యుద్ధం జరిగింది అని చెప్పవచ్చు. వరుణ్‌కి దూరంగా ఓ మూలన కూర్చుని ఏడుస్తున్న వితికాను కామన్‌సెన్స్ పెట్టి ఆలోచించు అని వరుణ్ చెప్పడం తో ఈ గొడవ మొదలైంది.నువ్ నా గురించి మాట్లాడకు అని వితికా ఏడుస్తూ అంటే.. నేను నీ గురించి మాట్లాడటం లేదు.. నువ్వే నా గురించి మాట్లాడుతున్నావు అని వరుణ్ సమాధానం ఇవ్వడంతో గట్టిగా అరిచింది వితికా. టైం స్పెండ్ చేయి.. టైం స్పెండ్ చేయి అంటే ఏం మాట్లాడుతున్నావు అసలు. మనం వచ్చింది బిగ్ బాస్ షోకి హనూమూన్‌కి కాదు. అది నీకు అర్ధం అవుతుందా అంటూ వితిక పై ఫుల్ ఫైర్ అయ్యాడు. దీంతో వితికా.. నేను నాతోనే ఉండమని అనడంలేదు. నీ ఫ్రెండ్స్ ఉన్నారు కదా వెళ్లి మాట్లాడుకో అంటూ గట్టిగా అరిచి చెప్పింది. దీంతో వరుణ్ కూడా సీరియస్ అయ్యాడు. ప్రతి దాన్ని బూతద్దంలో చూస్తే ఇలాగే ఉంటుంది. ప్రతిదీ నీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావు అంటూ భార్య పై తనకున్న కోపాన్ని ప్రదర్శించాడు.
దీంతో వితిక నేను ఎవరి గురించో మారను.. నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటా.. నేను హర్ట్ అయ్యేటట్లు నువ్ మాట్లాడకు. హౌస్‌లో నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటా. నువ్ ఎందుకు నాకు చెప్తున్నావు . దయచేసి నువ్ నాతో మాట్లాడకు నన్ను ఇలా వదిలెయ్ అంటూ ..ఇలా మాట మాట పెరగడంతో గొడవ పెద్దదిగా మారిపోయింది. గట్టిగా ఏడుస్తూ బాత్రూమ్‌కి వెళ్లి గుక్కపెట్టి ఏడ్చింది . ఆమె వెనుక బాత్రూంకి వెళ్లి నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అంటూ మళ్ళీ బుజ్జగింపులు మొదలుపెట్టాడు వరుణ్. ఇకపొతే టాస్క్ రద్దు కారణంగా జైలులో ఉన్న రాహుల్, వరుణ్‌ల మధ్య డిస్కషన్ జరగ్గా, పునర్నవి హర్ట్ అయ్యేట్టుగా మాట్లాడాడు రాహుల్. ఆమె కన్నీళ్లు పెట్టుకునేలా చేశాడు. దీనిపై సీరియస్ డిస్కషన్ జరుగుతుండుగా, వారిద్దరి జైలు శిక్ష ముగిసినట్టు ప్రకటించారు బిగ్ బాస్. ఈవారం బిగ్ బాస్ హౌస్ కి కెప్టెన్‌ని ఎన్నుకునే ప్రక్రియలో భాగంగా.. ముందుగా కెప్టెన్ కోసం అర్హులైన ముగ్గురు పేర్లు.. అనర్హులుగా ముగ్గురు పేర్లను మొత్తం ఆరుగురు పేర్లను ఏకాభిప్రాయంతో చెప్పాలని బిగ్ బాస్ కోరారు. దీంతో బిగ్ బాస్ హౌస్‌కి వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చిన శిల్ప, రవి, రాహుల్‌లను అనర్హులుగా, బాబా భాస్కర్, హిమజ, శ్రీముఖిలను అర్హులుగా ప్రకటించారు.
కెప్టెన్ అయ్యేందుకు ఈ టాస్క్‌లో అనర్హులుగా ఉన్న వాళ్లు అర్హులైన వాళ్ళు కెప్టెన్ అయ్యేందుకు సహకరిస్తారని ఎవరి కోసం ఎవరు ఆడతారో మీరే తేల్చుకోవాలని బిగ్ బాస్ తెలిపాడు. బాబా భాస్కర్ కోసం శిల్పా చక్రవర్తి, హిమజ కోసం రాహుల్, శ్రీముఖి కోసం రవి ఆడటానికి ముందుకు వచ్చారు. ‘ఆపిన వాడిదే అధికారం’ అంటూ సాగిన ఈ టాస్క్‌లో శిల్పా చక్రవర్తి సాయంతో హౌస్ మిస్టర్ పర్ఫెక్ట్ బాబా బాబా భాస్కర్ కెప్టెన్ అయ్యారు. అయితే తొలివారం నుండి కెప్టెన్ అయ్యేందుకు సాఫ్ట్ గేమ్ ఆడుతున్న శ్రీముఖి ఈ వారం కూడా అందివచ్చిన అవకాశాన్ని చేజిక్కించుకోలేక పోయింది. ఇక తాజాగా వచ్చిన ప్రోమోని ఒకసారి …. బిగ్ బాస్ హౌస్ కి కొత్త కెప్టెన్ గా ఎన్నికైన బాబా భాస్కర్ హౌస్ మేట్స్ రూల్స్ ని సవివరంగా చెప్తున్నటు ప్రోమో చూస్తే అర్థమౌతుంది.