telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

పెట్రోల్ బంక్‌ల‌కు తెలంగాణలో లాక్‌డౌన్ నుంచి మిన‌హాయింపు…

no licence renewal required to petrol and

పెట్రోల్ బంక్‌ల‌కు లాక్‌డౌన్ నుంచి మిన‌హాయింపు ఇచ్చింది తెలంగాణ స‌ర్కార్.. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పెట్రోల్ బంకులన్నీ ఎప్పటిలా సాధారణంగా ప‌నిచేయ‌నున్నాయి. కాగా, లాక్‌డౌన్‌ సమయంలో పెట్రోల్ బంక్‌లు కూడా ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంచాలని గ‌తంలో పేర్కొంది ప్రభుత్వం. కానీ, అత్య‌వ‌స‌ర సేవ‌లు, లాక్‌డౌన్‌లో మిన‌హాయింపు ఉన్న‌వారికి ఇది పెద్ద స‌మ‌స్య‌గా మారిపోయింది… ఓవైపు ధాన్యం సేకరణ జోరుగా సాగుతోంది. దీనివల్ల ట్రక్కులు రైస్‌ మిల్లులకు ధాన్యం తరలించాల్సిన అవసరం ఉంది. పైగా వ్యవసాయ పనుల కోసం పెట్రోల్‌, డీజిల్ ఎంతో అవ‌స‌రం.. దీంతో.. ప్రభుత్వం పెట్రోల్‌ పంపులకు సంబంధించి నిబంధనలను సడలించాలని నిర్ణయించింది. ప్ర‌భుత్వ తాజా నిర్ణ‌యంతో.. పట్టణాల‌తో పాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ పెట్రోల్ బంక్‌లు ఎప్ప‌టిలాగే సాధార‌ణంగా ప‌నిచేయ‌నున్నాయి.

Related posts