telugu navyamedia
క్రీడలు వార్తలు

ఆసీస్-భారత్ మహిళల మధ్య టెస్ట్…

ఈ ఏడాది సెప్టెంబరులో ఆస్ట్రేలియా పర్యటించనున్న భారత మహిళల టీమ్‌ అక్కడ కూడా ఏకైక టెస్టు మ్యాచ్‌ బరిలోకి దిగనుంది. ఒకే ఏడాది రెండు అగ్రశ్రేణి జట్లతో భారత మహిళలు టెస్టులు ఆడనుండటం విశేషం. ఇరు బోర్డులు దీనిపై ఇంకా అధికారిక ప్రకటన చేయకున్నా… ఆసీస్‌ పేస్‌ బౌలర్‌ మేగన్‌ షూట్‌ ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించింది. మరోవైపు బీసీసీఐ కూడా హింట్ ఇచ్చింది. ‘ఇంగ్లండ్, ఆసీస్ మహిళల టీమ్స్ మాత్రమే టెస్ట్ క్రికెట్ ఆడుతున్నాయి. అందుకే మనం కూడా అదే దారిలో వెళ్లాలని అనుకుంటున్నాం. అందులో భాగంగా ఆసీస్‌తోనూ ఓ మ్యాచ్ ఆడేలా షెడ్యూల్ సిద్దం చేస్తున్నాం’అని ఓ బీసీసీఐ అధికారి తెలిపారు. పురుషుల పింక్ బాల్ టెస్ట్ సందర్భంగా వచ్చిన ఈ ఆలోచనను.. గత నెలలో జరిగిన అపెక్స్ కౌన్సిల్ మీటింగ్‌లో చర్చించారు. 1977, 1984, 1990-91, 2006లలో కలిపి భారత్, ఆస్ట్రేలియా మహిళల జట్ల మధ్య మొత్తం 9 టెస్టు మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో ఆసీస్‌ 4 గెలవగా, మరో 5 ‘డ్రా’గా ముగిశాయి. భారత్‌ ఒక్కదాంట్లోనూ విజయం సాధించలేదు. 2006లో అడిలైడ్‌లో జరిగిన మ్యాచ్‌ తర్వాత ఇరు జట్ల తలపడనుండటం ఇదే మొదటిసారి.

Related posts