ఆర్టీసీ ప్రైవేటీకరణ సాధ్యం కాదని తెలంగాణ ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ స్పష్టం చేశారు. కార్మికులు అధైర్యపడవద్దని, ప్రైవేటీకరణ అనేది చట్టంలో లేదని వెల్లడించారు.ఆర్టీసీ సమ్మె కొనసాగుతుందని తెలిపారు. ఆర్టీసీ జేఏసీ నిర్ణయాన్ని ఎండీకి పంపిస్తామని, సీఎం కేసీఆర్ ఆర్టీసీపై మంచి నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నామన్నారు.
రేపు డిపోల ఎదుట మానవహారం నిర్వహిస్తామని ప్రకటించారు. రేపు ఎంజీబీఎస్‌లో మహిళా ఉద్యోగుల నిరసన కార్యక్రమాలు చేపడుతారని తెలిపారు. అన్ని డిపోల కార్మికులు ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటాలకు నివాళులర్పించి డిపోల ముందు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. తదుపరి కార్యాచరణను ఆదివారం ప్రకటిస్తామని పేర్కొన్నారు.
చంద్రబాబు పార్టీ శ్రేణులకు ఏం నమ్మకం ఇవ్వగలడు: విజయసాయి