telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

ఇదే మా బస్తి…. చిత్తు కాగితాలతో దోస్తీ

ఇదే మా బస్తి
చిత్తు కాగితాల తో దోస్తీ
చిల్లర పైసలు కై కుస్తీ
పచ్చడి మెతుకులకై పస్తే..
ఎర్రగా మండే ఎండ
జడి చినుకులతో తడిపే వాన
విసిరి కొట్టే విసురు గాలి
యముకలు విరిచే చలి
పైన ఆకాశం క్రింద భూమి
ఇదే మా బస్తి వాసులు ఇల్లు..
కారుచికటి
కటిక ఆకలి
గంజి నీళ్ళు
దొరికితే చాలు
నడి విధిలో పడక
కంటికి నిద్ర రాక..
అనాధలమో
అభాగ్యులమో
ఆకలి రాజ్యనికి రారాజులమో
అన్నమో రామచంద్ర
అన్నమో రామచంద్ర
అడిగితే పెట్టేవారు లేరు రామ..
ఆకలి కేక
వినిపించని దాకా
సాగాలి మా నడక
ఆకలి తీరే గమ్యం చేరేదాకా
పోదాం పద పోదాం పద
ఈనాటి వీధి బాలలే
రేపటి భావిభారత పౌరులం
ఆకలి లేని రాజ్యాన్ని అందిద్దాం..

Related posts