telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

రైతులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్

cm jagan

సిఎం జగన్ అధ్యక్షతన ఇవాళ ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అయితే ఈ కేబినెట్ భేటీలో పలు కీలక అంశాలపై చర్చ జరుగనుంది. ముఖ్యంగా వైఎస్సార్ రైతు భరోసా పథకానికి ఆమోదం తెలుపనున్న కేబినెట్..రైతు భరోసా కోసం 3 వేల 30 కోట్లకు ఆమోదం తెలుపనుంది. అలాగే వైఎస్సార్ ఉచిత భీమా పథకానికి ఆమోదం తెలుపనున్న కేబినెట్.. 2,589 కోట్లతో వైఎస్సార్ ఉచిత భీమా పథకం అమలు చేయనుంది. వైఎస్సార్ మత్స్యకార భరోసా పథకానికి ఆమోదం తెలపనున్న కేబినెట్.. మత్స్యకారులకు 10 వేలు చొప్పున ఆర్థిక సహాయం అందించనుంది జగన్ ప్రభుత్వం. అంతేకాదు.. ఆంధ్రప్రదేశ్ ప్రైవేటు యూనివర్సిటీల చట్టం-2016కు సవరణలకు ఆమోదం తెలుపనున్న కేబినెట్..కడప జిల్లాలో యోగి వేమన విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ కళాశాల అభివృద్ధికి 66 కోట్ల రూపాయల కేటాయింపు చేయనుంది. టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి కేబినెట్ అనుమతి ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రకాశం పాల ఉత్పత్తిదారుల కంపెనీకి ఏపీడీడీసీఎఫ్ ద్వారా 69 కోట్ల రుణం ఇచ్చే అంశాన్ని ర్యాటిఫై చేయనుంది కేబినెట్. శ్రీకాకుళం జిల్లాలో యానిమల్ హస్బెండరీ పాలిటెక్నిక్ కళాశాలకు 30 ఎకరాల భూ కేటాయింపుకు ఆమోదం తెలుపనుంది కేబినెట్.

Related posts