telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సినిమా వార్తలు

హనీమూన్ విషయంలో కాజల్ ను ఫాలో అవుతున్న మెగా డాటర్…

Niharika

పెళ్లి తర్వాత చాలా జంటలు హనీమూన్ కు వెళ్లడం సర్వసాధారణం. అయితే ఈ మధ్య తాజాగా మెగా డాటర్ నిహారిక కొణిదెల ఇటీవలే గుంటూరు జిల్లాకు చెందిన బడా పోలీస్ అధికారి జొన్నలగడ్డ ప్రభాకర్ రావు కుమారుడు జొన్నలగడ్డ చైతన్యని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. రాజస్థాన్ లోని ఉదయపూర్ ప్యాలెస్ లో వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. అయితే వీరు హైదరాబాద్ వచ్చాక సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన కొందరికి రిసెప్షన్ కూడా అరేంజ్ చేశారు. ఆ తరువాత ఈ జంట పుణ్యక్షేత్రాలు వెంట తిరుగుతూ కాలం గడిపేస్తోంది. తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈ కొత్త జంట హనీమూన్ కు వెళ్లబోతోంది. అది కూడా ఈ మధ్య కాలంలో బాగా ఫేమస్ అయిన మాల్దీవ్స్ కి. నిజానికి మాల్దీవ్స్ హనీమూన్ కి వెళ్లడం అనేది కామన్ విషయమే కానీ ఎప్పుడైతే కాజల్ అగర్వాల్ అక్కడికి హనీమూన్ చేసుకోవడానికి వెళ్ళిందో అప్పటి నుంచి చర్చనీయాంశంగా మారింది. కాజల్ ను చూసి వెళ్లారో లేక కాస్త వెకేషన్ ఎంజాయ్ చేయొచ్చు అని వెళ్ళారో తెలియదు కానీ దాదాపుగా టాలీవుడ్ హీరోయిన్లు అందరూ ఆ దీవి బాట పట్టారు. ఇప్పుడు అదే చోటకు ఈ కొత్త జంట కూడా తమ హనీమూన్ కోసం వెళుతున్నట్లు సమాచారం.

Related posts