telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సోనూసూద్ ఆస్తులు రూ.130 కోట్లట!

Sonu-Sood

కరోనా మొదలైనప్పటి నుంచి సోనూసూద్ స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేస్తూ రియల్ హీరోగా దేశవ్యాప్తంగా పేరు సంపాదించుకున్నాడు. ఎక్కడ ఎవరికి కష్టం వాటిల్లినా నేనున్నానంటూ ముందుకు వస్తున్నాడు. తాజాగా ఆయన ఓ సాఫ్ట్ వేర్, ఓ బామ్మతో పాటు మదనపల్లెకు చెందిన ఓ రైతుకు ట్రాక్టర్ అందజేసి వార్తల్లో నిలిచాడు. సోనూసూద్ వరుసగా సేవా కార్యక్రమాలు చేస్తుండడంతో అసలు ఆయన ఆస్తుల విలువ ఎంత అని బాలీవుడ్ కు చెందిన ఓ మీడియా సంస్థ ఇటీవల అధ్యయనం చేసిందట. సోనూసూద్ బాలీవుడ్ లో సినిమాలతో పాటు తెలుగు, తమిళ భాషల్లో చాలా సినిమాల్లో నటించాడు. సినిమాల్లో సంపాదించిన డబ్బుతో ముంబైలో ఓ హోటల్ ప్రారంభించాడు. పెద్ద ఇల్లు కూడా కొనుక్కున్నాడు. ఈయన మొత్తం ఆస్తుల విలువ మరో రూ.130 కోట్లు ఉంటుందని తేలిందట. ఇటీవల సోనూసూద్ కరోనా రోగులకు సేవలందిస్తున్న వైద్యుల కోసం తన హోటల్ ను కూడా కేటాయించాడు. వేలాది మంది వలస కార్మికుల తరలింపు, మాస్కులు, నిత్యావసర సరుకుల పంపిణీ, సమస్యల్లో ఉన్న వారికి సాయం చేయడం ద్వారా సోనుసూద్ మొత్తం రూ.10 కోట్ల వరకు ఖర్చు పెట్టాడని వినిపిస్తోంది. లక్షల కోట్లు, వేల కోట్లు సంపాదించిన ఎంతోమంది బడా వ్యాపారులు ఎంతోకొంత విరాళాలు ఇచ్చి ఊరుకుంటే… సోనూసూద్ మాత్రం నిరాశ్రయుల కోసం భారీ మొత్తంలో ఖర్చు చేయడం, తన సేవా కార్యక్రమాలు ఇంకా కొనసాగిస్తుండటంతో ఆయనపై జనం ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Related posts