telugu navyamedia
ట్రెండింగ్ సామాజిక

24 గంటలలో .. కేరళకు నైరుతి రుతుపవనాలు ..

monsoon on june first week only

నైరుతి రుతుపవనాలు మరో 24 గంటల్లో కేరళను తాకనున్నట్లు భారత వాతావరణ శాఖ(ఐఎండీ) అధికారులు వెల్లడించారు. రుతుపవనాల రాకకు అనువైన వాతావరణం ఏర్పడిందని, దీనితో వచ్చే 24 గంటల్లో కేరళను తాకే అవకాశాలున్నాయని ఐఎండీ ఓ ప్రకటనలో తెలిపింది. జూన్‌ 9న కొల్లాం, అలప్పుళా జిల్లాలు, జూన్‌ 10న తిరువనంతపురం, ఎర్నాకుళం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఆ ప్రాంతాల్లో ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేశారు.

నైరుతి అరేబియా సముద్రం అల్లకల్లోలంగా మారనుందని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరించారు. ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ వారంతం వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దిల్లీ, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, విదర్భ, ఉత్తరప్రదేశ్‌ల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయని తెలిపారు. ఇక ఈశాన్య రాష్ట్రాల్లో రానున్న 3-4 రోజుల్లో వర్షాలు కురిసే అవకాశమున్నట్లు పేర్కొన్నారు.

Related posts