telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

హైదరాబాద్ పోలీసుల సాహసం.. 10 మంది సైబర్ నిందితులు అరెస్ట్

ఓఎల్ఎక్స్ నిందితులను పట్టుకునేందుకు హైదరాబాద్ పోలీసులు సాహసం చేశారు. భరత్ పూర్ వెళ్ళిన సిసిఎస్ సైబర్ క్రైమ్ పోలీసులు పై దాడులు..పోలీసుల వాహనాలను ధ్వంసం చేశారు సైబర్ నేరగాళ్లు. అర్ధరాత్రి భరత్ పూర్ లో పోలీసులను కొట్టిన సైబర్ నేరగాళ్లు…పోలీసుల ఎదురు దాడితో పారిపోయారు. పది మందిని పట్టుకొని సైబర్ క్రైమ్ పోలీసులు హైదరాబాద్ తీసుకొచ్చారు. వివరాల్లోకి వెళితే..OlX లో పేరుతో మోసాలకు పాల్పడుతున్న 10 మంది సైబర్ నిందితులను అరెస్ట్ చేశారు. ఓఎల్ఎక్స్ లో వాహనాల ఫోటోలు పెట్టి తక్కువ ధరకే అమ్ముతామంటూ మోసానికి పాల్పడింది ఓ ముఠా.

రాజస్థాన్ కి చెందిన ఈ ముఠాను హైదరాబాద్ సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. రాజస్థాన్ లోని భరత్ పూర్ జిల్లా కళ్యాణి పూరి చౌ వేరా గ్రామాల్లో ఉన్న నిందితులను అర్ధరాత్రి ఇళ్ల పై దాడులు చేసి అరెస్ట్ చేశారు. దాడుల సందర్భంలో నిందితులు వారి కుటుంబ సభ్యులు మూడు పోలీసు వాహనాలను ధ్వంసం చేశారు. రెండు గ్రామాలపై రైడ్ కి వెళ్ళ భరత్ పూర్ జిల్లా కు చెందిన వంద మంది పోలీసులు… హైదరాబాదు నుండి వెళ్లిన 10 సైబర్ క్రైమ్ పోలీసులపై దాడులకు పాల్పడ్డారు. అరెస్టయినవారిలో వాజిత్ ఖాన్, సాహిల్, సత్యవీర్ సింగ్, మోహన్ సింగ్ ఇర్ఫాన్, రాహుల్ ,అజరుద్దీన్, తారీఫ్ ఖాన్, ఉమ్రాన్ ఖాన్, ఇర్ఫాన్ లను అరెస్ట్ చేసి కోర్టులో పోలీసులు హాజరుపర్చారు. గత 5 రోజుల క్రితం 8 మందిని అరెస్టు చేయగా, ఈ రోజు 10 మందిని అరెస్టు, మొత్తం ఓఎల్ఎక్స్ గ్యాంగ్ 18 మందిని అరెస్ట్ చేశారు.

Related posts