telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

గమనం : ఆకట్టుకుంటున్న యువ జంట లుక్

Gamanam

సుజ‌నా రావు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ‘గ‌మ‌నం’ మూవీ రియ‌ల్ లైఫ్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రంలో శ్రియ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్నారు. తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం, హిందీ భాష‌ల్లో పాన్ ఇండియా ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ సినిమా రూపొందుతుండటం విశేషం. నిత్యామీనన్ కీలక పాత్రలో నటించారు. ప్రముఖ ర‌చ‌యిత సాయిమాధ‌వ్ బుర్రా సంభాష‌ణ‌లు రాస్తున్న ఈ చిత్రానికి మేస్ట్రో ఇళ‌యారాజా సంగీత సమకూరుస్తున్నారు. వి.ఎస్‌. జ్ఞాన‌శేఖ‌ర్ ఒక‌వైపు సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తూనే.. ర‌మేష్ క‌రుటూరి, వెంకీ పుష‌డ‌పుల‌తో క‌లిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘గ‌మ‌నం’ షూటింగ్ మొత్తం ఇప్పటికే పూర్తవ‌గా, ప్రస్తుతం పోస్ట్ ప్రొడ‌క్షన్ ప‌నులు జ‌రుగుతున్నాయి. ఇప్పటికే ఈ చిత్రం నుంచి శ్రియ, నిత్యా మీనన్ లుక్స్‌ను విడుదల చేశారు. తాజాగా మరో రెండు పాత్రలను పరిచయం చేశారు. చిత్రంలో యువ జంట అలీ, జారా పాత్రల‌ను పోషించిన శివ కందుకూరి, ప్రియాంక జ‌వాల్కర్ ఫ‌స్ట్‌లుక్‌ను సోమ‌వారం చిత్ర బృందం విడుద‌ల చేసింది. వైట్ జెర్సీలో క్రికెటర్‌గా శివ క‌నిపిస్తుండ‌గా, సంప్రదాయ దుస్తుల్లో అచ్చమైన ముస్లిం అమ్మాయిగా ప్రియాంక ద‌ర్శన‌మిస్తున్నారు.

Related posts