telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఓడిన తర్వాత ట్రంప్ కి ఏమైంది…?

అమెరికా అధ్యక్షా ఎన్నికలో ఓటమి పాలైనా వైట్‌ హౌజ్‌ ను వీడటం లేదు డొనాల్డ్ ట్రంప్. ఓటమిని అంగీకరించేందుకు ససేమిరా అంటున్నాడు. ఆఫీసును ఖాళీ చేయడానికి సిద్ధంగా లేడు. అంతేనా ప్రభుత్వంలోని మంత్రులను ఇష్టానుసారంగా పీకేస్తున్నాడు. బైడెన్‌ కు గెలిచిన ఆనందం లేకుండా చేస్తున్న అధ్యక్షుడి ట్రంప్ తీరు పై విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఫలితం ఎలా వచ్చినా దానిని స్వీకరించి హుందాగా తప్పుకుంటేనే గౌరవం ఉంటుంది. కానీ అగ్రరాజ్యం అధక్షుడు ట్రంప్‌ తీరే వేరు కదా. ఇదిగో.. ఇలా మెడబట్టి బయటకు గెంటేసేవరకు తెచ్చుకుంటున్నాడు. ప్రజలంతా బైడెన్‌ కు ఓటేసి గెలిపించినప్పటికీ… ఇంకా తనదే విజయమంటూ బీరాలు పోతున్నాడు ట్రంప్. న్యాయబద్ధమైన ఓట్లు లెక్కిస్తే.. తననే విజేతగా ప్రకటించాల్సి ఉంటుందని చెబుతున్నాడు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ గెలిచినట్లు ప్రకటించారు. కానీ, ప్రస్తుత అధ్యక్షుడు, రిపబ్లికన్ అభ్యర్థి డోనల్డ్ ట్రంప్ మాత్రం ఈ గెలుపును ఒప్పుకోవడంలేదు. కొన్ని రాష్ట్రాల్లో వెలువడిన ఫలితాలను చట్టపరంగా సవాలు చేస్తున్నారు. ముఖ్యంగా.. నాలుగు రాష్ట్రాల్లో ఓట్లు దోపిడీ చేశారని చెప్పడానికి తన దగ్గర బలమైన ఆధారాలు ఉన్నాయంటోంది ట్రంప్ టీమ్. ఇదే విషయమై ఇప్పటికే కోర్టులను ఆశ్రయించింది. కొన్నిచోట్ల వాటిని కోర్టులు కొట్టేశాయి కూడా. కానీ ట్రంప్ మాత్రం తాను పట్టిన కుందేలుకు మూడేకాళ్లన్నట్టుగా… ఫలితాలపై స్పందిస్తున్నారు

Related posts