telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

పవన్ కల్యాణ్ కు మరో షాక్..జనసేనను వీడనున్న ఆకుల?

ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు రాష్ట్రంలో మరో దెబ్బ తగలబోతోంది. రావెల కిషోర్‌ బాబు జనసేనకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. శాసనసభ ఎన్నికల్లో ఒక్క సీటు మాత్రమే గెలుచుకున్న జనసేనను వీడేందుకు ఓ సీనియర్ నేత సిద్ధపడ్డారు.

ఓటమిపై నేతలు అధైర్యపడవద్దని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పార్టీ నేతలకు సూచించినా ఫలితం ఉండడం లేదు. తాజాగా ఆ పార్టీ సీనియర్‌ నేత ఆకుల సత్యనారాయణ జనసేను వీడనున్నారు. తిరిగి ఆయన తన సొంతగూటికి(బీజేపీ)లో చేరనున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో రాజమండ్రి లోకసభ స్థానం నుంచి జనసేన తరఫున బరిలోకి దిగి ఆయన ఓటమి పాలయ్యారు.

Related posts