ఏకంగా పోలీస్ స్టేషన్‌కే కన్నం వేశారు దొంగలు. స్టేషన్‌ను ఆనుకుని ఉన్న స్టోర్ రూంలో విలువైన వస్తువులను అహపరించారు. చోరీ జరిగిన విషయాన్ని ఓ రోజైతేగాని పోలీసులు గుర్తించలేకపోవడం గమనార్హం. ఉత్తరప్రదేశ్‌లోని సాహిబాబాద్ పోలీస్ స్టేషన్‌లో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలావున్నాయి. ఈ స్టేషన్ పరిధిలో స్టోర్ రూం ఉంది. వివిధ కేసులకు సంబంధించి స్వాధీనం చేసుకున్న ఫోన్లు, కార్లు, ఇతర విలువైన వస్తువులను ఈ స్టోర్ రూంలో భద్రపరుస్తుంటారు.
అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఈ స్టోర్ రూంలోకి చొరబడి 90 బ్యాటరీలు, రెండు గ్యాస్ సిలెండర్లు, సీసీ టీవీ కెమెరాలు, కార్లలోని విడి భాగాలు ఎత్తుకెళ్లారు. తరువాత రోజు ఉదయం వరకు ఈ చోరీని ఎవరూ గమనించ లేదు. ఆ రోజు ఉదయం స్టోర్ ఇన్‌చార్జి గది వద్దకు వెళ్లగా తాళం పగులగొట్టి ఉండడం గమనించారు. దీనితో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. విచారణ చేపట్టిన దుండగులు మొత్తం నలుగురు ఈ చోరీకి పాల్పడినట్లు గుర్తించి ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి కొన్ని వస్తువులు స్వాధీనం చేసుకున్నారు.