telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

రామ్ చరణ్‌ కి పుట్టినరోజు శుభాకాంక్షలను తెలిపిన మెగాస్టార్

రామ్ చరణ్‌ శుక్రవారం 35వ పుట్టినరోజును జరుపుకోబోతున్నారు. ఇటీవలే సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన చిరు.. ఇన్‌స్టాలో చిన్నవయసులో చెర్రీతో పాటు ఉన్న ఫొటోను షేర్ చేశారు. ఈ సందర్భంగా చరణ్ జన్మించిన సమయంలో నేను సహజంగానే చాలా సంతోషపడ్డా. కానీ వరల్డ్ థియేటర్ డే రోజునే చరణ్‌ ఎందుకు పుట్టాడో తెలుసుకున్న తరువాత ఆ ఆనందం ఇంకా ఎక్కువైంది. మార్చి 27న ప్రపంచ రంగస్థల దినోత్సవం. నీటిలోని చేపలాగా చరణ్‌ నటనా ప్రపంచంలోకి వచ్చారు. రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ చరణ్ అని కామెంట్ చేశారు. ఇదిలా ఉంటే రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఆర్ఆర్ఆర్ నుంచి మరో స్పెషల్ వీడియో శుక్రవారం విడుదల కానుంది. ఈ విషయాన్ని ఎన్టీఆర్ సోషల్ మీడియాలో వెల్లడించారు. నీ పుట్టినరోజును చాలా గ్రాండ్ గా చేయాలనుకున్నా. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంటి పట్టునే మనం ఉండటం ముఖ్యం కాబట్టి.. శుక్రవారం 10 గంటలకు నేను నీకు డిజిటల్ సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నా. నన్ను నమ్ము. దీన్ని నువ్వు కచ్చితంగా ఎప్పటికీ మర్చిపోలేవు భీమ్ ఫర్ రామరాజు అని ట్వీట్ చేశారు. దానికి చెర్రీ స్పందిస్తూ.. నేను ట్విట్టర్‌లో సరైన సమయంలో ఎంట్రీ ఇచ్చాను. లేదంటే నీ సర్‌ప్రైజ్‌ను కచ్చితంగా మిస్ అయ్యేవాడిని. రేపటి వరకు ఎదురుచూడలేను అని కామెంట్ పెట్టారు.

Related posts