telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

వెస్టిండీస్ టెస్ట్ సిరీస్ : .. సిరీస్ ను కైవసం చేసుకున్న .. కోహ్లీ సేన..

india won test series on westindies

వెస్టిండీస్ తో ఆడిన వన్డే సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన భారత్, మూడు టెస్టుల సిరీస్ లో రెండు గెలుపొంది ఈ సిరీస్ ను కూడా సొంత చేసుకుంది. రెండో టెస్టు గెలుపొందడంతో కోహ్లీ కూడా అత్యధిక టెస్ట్ లు గెలిపించిన సారధిగా మరో రికార్డు సొంతం చేసుకున్నాడు. ఈ రికార్డు గతంలో ధోనిపేర(27) ఉండగా, 28 టెస్టులు గెలిచి కోహ్లీ దానిని సొంతం చేసుకున్నాడు. రెండో టెస్టును కూడా భారత జట్టు సునాయాసంగా కైవసం చేసుకుంది. రెండో టెస్టు ఆఖరి రోజులోనూ కరేబియన్లపై జైత్ర యాత్ర కొనసాగించింది. కింగ్ స్టన్ వేదికగా జరిగిన రెండో టెస్టులో టీమిండియా 257పరుగుల భారీ తేడాతో మరో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. 468పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన విండీస్.. రెండో ఇన్నింగ్స్ లో 210పరుగులతో సరిపెట్టుకుంది. 45/2ఓవర్ నైట్ స్కోరుతో బరిలోకి దిగిన విండీస్ ఆరంభంలో కాస్త దూకుడు చూపించినా నిలబెట్టుకోలేకపోయింది. భారత బౌలర్ల విజృంభణకు తలవొంచింది.

రవీంద్ర జడేజా(3/58), మొహ్మద్ షమీ(3/65), ఇషాంత్ శర్మ(2/37)తో చెలరేగారు. తొలి ఇన్నింగ్స్‌లో 416పరుగులు చేసిన భారత్ ప్రత్యర్థిని 117పరుగులకే కట్టడి చేసింది. ఫాలో ఆన్ ఇవ్వకుండా రెండో ఇన్నింగ్స్ ఆడిన కోహ్లీసేన 54.4ఓవర్లలో 4వికెట్లు కోల్పోయిన భారత్ 168పరుగులకే డిక్లేర్ చేసింది. టెస్టు కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ 28విజయాలు సాధించాడు. కోహ్లీ కెప్టెన్సీలో 48టెస్టు మ్యాచ్‌లు ఆడిన టీమిండియా 10ఓడి, 10డ్రాగా ముగించింది. ఈ మ్యాచ్‌తో 60మ్యాచ్‌లలో 27గెలిచి టాప్‌లో ఉన్న ధోనీ రికార్డును కోహ్లీ అధిగమించాడు.

Related posts